Header Banner

'అన్నదాత సుఖీభవ' లబ్దిదారుల నమోదు! అర్హులు ఎవరంటే!

  Mon May 12, 2025 07:38        Politics

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల అమలు కసరత్తు కొనసాగుతోంది. రైతులకు ప్రతీ ఏటా రూ 20 వేలు ఆర్దిక సాయం అందిస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ పథకం అమలు పైన మార్గదర్శకాలు సిద్దం అయ్యాయి. ఈ నెలలోనే తొలి విడత నిధుల విడుదలకు నిర్ణయించారు. ఇందు కోసం లబ్దిదారులు తమ వివరాల నమోదు తో పాటుగా చివరి తేదీ.. అదే సమయంలో అర్హతలను ఖరారు చేసారు.

 

నమోదు కోసం
అన్నదాత సుఖీభవ పథకం అమలు దిశగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. పథకానికి అర్హత ఉన్న రైతులు రైతు సేవా కేంద్రంలో ఈనెల 20వ తేదీలోగా వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో పాటుగా రైతులకు మూడు విడతల్లో ఈ పథకం అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. కేంద్రం ఇచ్చే రూ 6 వేలను మినహాయించి మిగిలిన రూ 14 వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌కు ముందే ఈ సాయాన్ని అందించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా చర్యలు సైతం మొదలు పెట్టింది.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అర్హతలు
అన్నదాత సుఖీభవం పథకానికి ప్రజా ప్రతినిధులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారికి ఈ పథకం వర్తించదు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత ఉంటుంది. ఇందుకోసం రైతుసేవా కేంద్రాల వారీగా వెబ్‌ల్యాండ్‌ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు మండల వ్యవసాయ అధికారి లాగిన్లకు ఇచ్చారు. వెబ్‌ల్యాండ్‌లో సర్వే నెంబర్లు, రైతు పేరు, భూమి విస్తీర్ణం రైతు సేవాకేంద్రాల్లో పరిశీలిస్తారు. అనంతరం వ్యవసాయాధికారి లాగిన్‌కు ఆ వివరాలను పంపిస్తారు. ఆ తర్వాత జిల్లా వ్యవసాయ అధికారికి వివరాలు వెళ్తాయి. వెబ్‌ల్యాండ్‌లో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేస్తారు. క్షేత్రస్థాయిలో అనర్హులను గుర్తించి లిస్ట్ నుంచి తొలగిస్తారు.

 


20వ తేదీ లోగా
అన్నదాత సుఖీభవ పథకం కోసం రైతు సేవా కేంద్రంలో ఈనెల 20లోగా వివరాలను నమోదు చేసుకోవాలి. జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత వెబ్‌ల్యాండ్‌ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పింపిస్తారు. అక్కడ నుంచి ఆర్‌జీఎస్‌కు పంపిన తరువాత, ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఆధార్‌ అనుసంధానంగా అనర్హులను గుర్తిస్తారు. అనంతరం ఫైనల్ జాబితాను మళ్లీ రైతు సేవా కేంద్రాలకు పంపుతారు. అందులోని లబ్ధిదారులందరితో సంబంధిత అధికారులు ఈ-కేవైసీ చేపిస్తారు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత ఉంటుందని అధికారులు వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: వారికి శుభవార్త.. ఇంక నుండి ఆస్తి పన్ను ఉండదు! పవన్ సంచలన నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా! కీలక అప్‌డేట్!

 

భారత్ తో యుద్ధం చేసే సత్తా పాక్కు లేదు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

మోదీ సంచలన ప్రకటన! పీఓకే పాక్ అప్పగించాల్సిందే, ఆపరేషన్ సింధూర్ ముగియలేదు!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు 

మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AnnadataSukhibhava #FarmerWelfare #BeneficiaryRegistration #AndhraFarmers #FarmerSupport #GovernmentSchemes #AgricultureIndia